Site icon NTV Telugu

Donald Trump: పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక

Trump

Trump

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే, రష్యా మరిన్ని ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

Also Read:ICICI Minimum Balance: ఐసిఐసిఐ బ్యాంక్ యూ-టర్న్.. కనీస బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు.. ఖాతాలో ఇంత డబ్బు ఉంటే చాలు

ఈ సమావేశానికి ముందు, డోనాల్డ్ ట్రంప్ పుతిన్‌కు స్పష్టమైన మాటలలో తీవ్ర హెచ్చరిక చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను మాస్కో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని తెలిపారు. అలాస్కాలో జరిగే సమావేశంలో ఎటువంటి ఖచ్చితమైన ఫలితం రాకపోతే , మాస్కోపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. బహుశా ఆర్థిక ఆంక్షలు విధించవచ్చు. అయితే, ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధిస్తారో లేదా ఎప్పుడు విధిస్తారో ట్రంప్ స్పష్టం చేయలేదు. మీడియాతో మాట్లాడుతూ ట్రంప్, “ఇది బైడెన్ యుద్ధం. నేను దీనికి ముందు ఐదు యుద్ధాలను ముగించాను. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read:Cows Thieves: ఖరీదైన కార్లలో వస్తారు.. రెక్కీ చేసి ఆవును కారులో కుక్కేస్తారు!

పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే, రష్యా చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని మనం నాశనం చేశాం. పుతిన్‌తో మొదటి సమావేశం సజావుగా జరిగితే, త్వరలోనే రెండో సమావేశం నిర్వహిస్తాం. వారు నన్ను అక్కడికి ఆహ్వానించాలనుకుంటే, అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు జెలెన్స్కీ, నా మధ్య రెండో సమావేశం అతి త్వరలో జరుగుతుందని తెలిపారు.

Exit mobile version