Site icon NTV Telugu

Donald Trump: ట్రంప్‌ ప్రచార సభలో ఎలాన్‌ మస్క్‌.. వేదికపై కొత్త ఉత్సాహం

Elon Musk

Elon Musk

Donald Trump: వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలోన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాడు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్ సంతాపం తెలిపారు. ట్రంప్ కార్యక్రమంలో అనుమానితుడిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. మా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు.. మా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేలరని వ్యాఖ్యలు చేసారు.

Also Read: Iran Israel War: ఫ్రెంచ్ కంపెనీపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి

ఈ కార్యక్రమంలో అందరూ ట్రంప్ కు మద్దతుగా టోపీలు ధరించారు. ఇదివరకే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ప్రచార కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి. గత జూలైలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించగా.. ఆ సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌ను కాల్చి చంపేందుకు ప్రయతనం చేసాడు. ఆ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవిలో బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను రక్షించారు. తనపై కాల్పులు జరిగిన ప్రదేశంలోనే ప్రచార ర్యాలీలో పాల్గొంటానని ట్రంప్ ఎక్స్ వేదికగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎలాన్ మస్క్ ప్రసంగించారు. టెస్లా CEO ఎలోన్ మస్క్ కూడా ట్రంప్‌తో పాటు వేదికపై కనిపించారు. వేదికపైకి వెళ్లిన ఎలోన్ మస్క్ కూడా ట్రంప్‌కు మద్దతు కోరారు. ఈ ఎన్నికల ర్యాలీలో వేలాది మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.

Exit mobile version