Donald Trump: ట్రంప్ ప్రచార సభలో ఎలాన్ మస్క్.. వేదికపై కొత్త ఉత్సాహం
- వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.
- తనపై కాల్పులు జరిగిన ప్రదేశంలోనే మరోసారి ప్రచార ర్యాలీ.
- ప్రచార సభలో ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలోన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాడు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్ సంతాపం తెలిపారు. ట్రంప్ కార్యక్రమంలో అనుమానితుడిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. మా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు.. మా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేలరని వ్యాఖ్యలు చేసారు.
Also Read: Iran Israel War: ఫ్రెంచ్ కంపెనీపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఈ కార్యక్రమంలో అందరూ ట్రంప్ కు మద్దతుగా టోపీలు ధరించారు. ఇదివరకే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ప్రచార కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి. గత జూలైలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించగా.. ఆ సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌ను కాల్చి చంపేందుకు ప్రయతనం చేసాడు. ఆ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవిలో బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను రక్షించారు. తనపై కాల్పులు జరిగిన ప్రదేశంలోనే ప్రచార ర్యాలీలో పాల్గొంటానని ట్రంప్ ఎక్స్ వేదికగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎలాన్ మస్క్ ప్రసంగించారు. టెస్లా CEO ఎలోన్ మస్క్ కూడా ట్రంప్‌తో పాటు వేదికపై కనిపించారు. వేదికపైకి వెళ్లిన ఎలోన్ మస్క్ కూడా ట్రంప్‌కు మద్దతు కోరారు. ఈ ఎన్నికల ర్యాలీలో వేలాది మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.
#TrumpRally #ButlerPA Elon Musk is a DARK MAGA immigrant who now hates immigrants. If we're deporting, let's start with Elon Musk, Rupert Murdoch, Melania Trump and anchor babies like Donald Trump, Eric Trump, Don, Junior, and Ivanka. Who agrees? pic.twitter.com/hog9qOI5pQ
— Andy Fox 🌊🇺🇸 for Harris Walz vs Felon Trump (@factandrumor) October 6, 2024
Incredible crowd today at the rally in Pennsylvania pic.twitter.com/pamx8yAMd8
— Elon Musk (@elonmusk) October 6, 2024
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!