ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు పడుతున్నట్లు పాట్లు అన్నీ ఇన్నీ కావు. మూడు రోజులుగా విమానాశ్రయాల్లోనే ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇంకో వైపు లోపలికి వెళ్లిన లగేజీ బ్యాగ్‌లు తిరిగి రావడానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో నేలపైనే ప్రయాణికులు సేదతీరుతున్నారు. ఇంకోవైపు ఆహారం, నీరు దొరకక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Putin: రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు ఘన స్వాగతం.. త్రివిధ దళాలు గౌరవ వందనం
ఇదిలా ఉంటే శుక్రవారం అర్ధరాత్రి వరకు అన్ని ఇండిగో దేశీయ విమానాలను రద్దు చేసింది. దాదాపు 400 సర్వీసులు రద్దయ్యాయి. అర్ధరాత్రి వరకు బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కూడా కనిపించడం లేదు. ఫిబ్రవరి వరకు ఈ సమస్యలు ఉండొచ్చని సమాచారం. దీంతో ప్రయాణికులు వేరే ఎయిర్‌లైన్స్ బుకింగ్‌కు సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!
నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లుగా ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే ఫిబ్రవరి 10 వరకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను ఇండిగో అధికారులు కోరారు. అందుకు డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. దీంతో ఇండిగో ప్రయాణికుల కష్టాలు మరిన్ని రోజులు ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.