Site icon NTV Telugu

Spy Camera : యాజమానురాలి బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు

Spy Camera

Spy Camera

గురుగ్రాంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషియాజమానురాలికి తెలియకుండా తన బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read : Uttar Pradesh: మానవమృగం.. 12 మంది బాలికలపై లైంగిక వేధింపులు..

ఇక వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఓ మహిళ పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు తన యాజమానురాలి బెడ్‌రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కనిపించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలో నుంచి తీసి వేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. సదరు మహిళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.

Also Read : Honey Rose : అందాలతో మత్తెక్కిస్తున్న మలయాళం కుట్టి

కానీ.. ఆ పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శుభం కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడి దగ్గర నుంచి పోలీసులు కీలక విషయమాలు రాబడుతున్నారు. ఈ విషయం బయటకు రాకుండా తాము చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Exit mobile version