NTV Telugu Site icon

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం.. చేసిందేమీ లేదు..!

Veligonda

Veligonda

Veligonda Project: గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు.. ప్రాజెక్టులో చాలా పనులు మిగిలి పోయాయి.. గత ఐదేళ్లలో ప్రాజెక్టు కోసం వైఎస్‌ జగన్ చేసిందేమీ లేదన్నారు.. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. పోలవరం తర్వాత వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.

Read Also: ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’

ఇక, మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టాం అన్నారు.. గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టులు మొత్తం నిర్వీర్యం చేశారని ఆరోపించిన ఆయన.. ప్రాజెక్టులను మెయింటెనెన్స్ లేక గేట్లు కూడా కొట్టుకు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కూడా కొట్టుకు పోయి వేల కోట్లు మళ్లీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారతాయని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Show comments