Site icon NTV Telugu

Viral News : సింహాన్నే పరిగెత్తించిన వీధి కుక్కలు.. తోక ముడిచిన మృగరాజు

Lion In Village

Lion In Village

కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.. ఇది నిజమేనా అనే భావనను కలిగిస్తుంటాయి. అడవిలో జంతువులకు రారాజు వన్యప్రాణుల గుండెల్లో వణుకు తెప్పించే సింహాన్ని భయపెట్టడమంటే వాటి ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అలాంటి సింహాం జనావసాల మధ్య తిరుగుతుంటే ఎలా ఉంటుంది.? ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే.. ఇక్కడ విచిత్ర ఏంటంటే.. అడవికే రాజైన సింహాన్ని వీధి కుక్కలు పరిగెత్తించడం. అర్థరాత్రి వేళ నిర్మానుష్యమైన ఓ గ్రామంలోని రోడ్డుపై సింహాం ప్రత్యక్షమైంది. అయితే.. ఆ మృగరాజును చూసిన గ్రామసింహాలు అరవడం మొదలెట్టాయి. దీంతో తోకముడిచిన మృగరాజు పరిగెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. తన ఒక్కో పంజా దెబ్బతో ఒక్కొటి చొప్పున కుక్కలను చావుదెబ్బకొట్టగల సింహాం.. ఇలా శునకాల అరుపులకు పరగెత్తడం అనూహ్యమైన ఘటన.

Also Read : Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?

అయితే.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. కుక్కల అరుపులకు పరుగెత్తిన సింహాం ఆవుల మందవైపుకు వెళ్లడం కొసమెరుపు. ఆతరువాత ఏం జరిగి ఉంటుందోనని అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ గ్రామంలో చోటు చేసుకుంది. సింహం గ్రామ వీధుల్లో తిరుగుతుండగా కుక్కల గుంపు అడవి రాజును తరిమికొట్టింది. దీంతో పక్కనే నిలబడి ఉన్న ఆవుల మంద వైపు సింహం పరుగెత్తింది.

Also Read : Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి..

Exit mobile version