Dog Struck Under Train: రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పెనుప్రమాదమే జరగొచ్చు. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను మనం తరచూ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. రైల్వే గేటు వద్ద దాటుతూ ప్రాణాలు కోల్పొయిన వారు ఎంతో మంది. మనుషులే కాదు ఏనుగులు, గేదెలు, కుక్కలు, మేకలు లాంటి ఎన్నో మూగజీవులు రైలు కింద పడి ప్రాణాలు కోల్పొయాయి. ఇక మరికొన్ని సార్లు మనుషులు జారీ రైలు వస్తున్న సమయంలో పట్టాలపై పడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా రైలు ఎక్కుతూ పడిపోగా పక్కనున్న రైల్వే కానిస్టేబుళ్లు కాపాడిన ఘటనలు కోకొల్లలు. అంతే కాకుండా రైలు కింద పడి కదలకుండా పట్టాల మధ్యలో ఉండి ప్రాణాలు నిలుపుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
Also Read: Man cuts off Finger: ప్రధాని మోడీకి ఓటు వేసిన వేలును నరుకున్న వ్యక్తి.. కారణమేంటంటే?
మనుషులు రైలు కింద పడినప్పుడు సమయస్ఫూర్తితో తప్పించుకున్నారనుకోవచ్చు. అయితే రైలు కింద పడిన ఓ కుక్క కూడా చాలా తెలివితో తన ప్రాణాలను దక్కించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దీనిని ఇప్పటికే లక్షల మంది చూశారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆ కుక్కకు ఏమైనా అవుతుందేమో అనే భయం వెంటాడుతోంది. ఇక డాగ్ లవర్స్ ఈ వీడియో చూస్తే అల్లాడిపోవడం పక్కా. ఈ వీడియోలో ఒక కుక్కపై నుంచి రైలు వేగంగా వెళుతూ ఉంటుంది. అయితే కుక్క చాలా తెలివిగా రైలు వెళుతున్న సమయంలో ఎటూ కదలకుండా రైలు పట్టాల మధ్యలోనే కూర్చొని ఉంటుంది. రైలు వెళ్లిపోయిన వెంటనే హమ్మయ్యా బతికిపోయానురో అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ తన్సు యేగన్ అనే వ్యక్తి ప్రతి సమస్యకు ఓర్పు మంచి రెమిడీ అనే క్యాప్షన్ ను జోడించాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కుక్క చూపిన సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. దేవుడి దయ వల్ల అది ప్రాణాలతో బయటపడిందని కామెంట్ చేస్తున్నారు.
Patience is the best remedy for every trouble👏 pic.twitter.com/WvPmX0F3a1
— Tansu YEĞEN (@TansuYegen) August 17, 2023