Site icon NTV Telugu

Nandyal: కొత్త బురుజు ఆస్పత్రిలో వాచ్మెన్లే డాక్టర్లు

Nandyal

Nandyal

Nandyal: నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్‌లో వాచ్‌మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్‌మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు. రెండ్రోజుల క్రితం కొత్తబురుజు హాస్పిటల్‌లో వైద్యం చేస్తున్న వాచ్‌మెన్ వీడియోలు తీసిన కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. రోగులకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..

ఎన్టీవీ కథనానికి అధికారులు స్పందించారు. డోన్ మండలం కొత్తబురుజు ఆస్పత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 5 గురు వైద్య సిబ్బందిపై వేటు వేశారు. కొత్త బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఐదు మంది వైద్య సిబ్బందిపై వేటు పడింది. నీలిమ, నాగరాజు, అన్నపూర్ణ, రేఖ, శంకరమ్మలను కలెక్టర్ రాజకుమారి గనియా సస్పెన్షన్ వేటు వేశారు.

 

Exit mobile version