Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. అనంతరం ఈ విషయమై సీఎంఓకు ఫిర్యాదు చేశారు. చిన్నారి ఎడమ కంటిలో సమస్య ఉందని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. ఆసుపత్రిలో పరీక్షించిన అనంతరం వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఇందుకోసం తొలుత ఆస్పత్రిలో రూ.45 వేలు డిపాజిట్ చేశారు. దీంతో వైద్యులు చిన్నారిని అడ్మిట్ చేసి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం వైద్యులు చిన్నారిని డిశ్చార్జి చేయడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
Also Read: Tonk Violence: హింసాకాండ.. బూడిదైన 100 వాహనాలు.. 60 మంది అదుపులో
కుటుంబ సభ్యులు అక్కడ పరిశీలించగా ఎడమకంటికి కాకుండా కుడికంటికి ఆపరేషన్ చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు తొలుత ఆస్పత్రికి చేరుకుని వీరంగం సృష్టించారు. అనంతరం సీఎంఓ కార్యాలయానికి చేరుకుని ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రేటర్ నోయిడాలోని బీటా 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ గామా 1లో ఉన్న ఆనంద్ స్పెక్ట్రమ్ ఆసుపత్రికి సంబంధించినది. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Childrens day 2024: నేటి బాలలే రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు