Site icon NTV Telugu

Supreme Court : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..

Supremecourt

Supremecourt

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులతో సహా) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

READ MORE: Nara Lokesh: ఇక పై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు..

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, విమానయాన నిపుణులు, ఆర్థికవేత్తలు, బీమా సంస్థల నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. త్రివేణి కోడ్కనీ వర్సెస్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సూత్రాల ప్రకారం.. బాధిత కుటుంబాలకు తుది పరిహారాన్ని ఈ కమిటీ నిర్ణయించాలని స్పష్టం చేశారు. దీనితో పాటు, బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేకుండా.. పరిహారం క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించడానికి ఎయిర్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించాలని పిటిషన్ కోరారు.

READ MORE: Donald Trump: ‘‘ పరిస్థితి మరింత దిగజారుతుంది’’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

మృతులకు అర్హులైన బంధువులకు పునరావాస సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని పిటిషన్‌లో కోరారు. అలాగే.. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

Exit mobile version