Gandhi Jayanti: మారిన మనిషి మహాత్ముడు అవుతాడు అని నిరూపించిన వ్యక్తి గాంధీజీ. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్‌బందర్‌లో జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మా గాంధీగా ఎలా మారారు..? అయన ఎవరి సూచన పైన భారత దేశం మొత్తం పర్యటించారు..? అయన స్వాతంత్రం కోసం ఎలాంటి ఉద్యమాలని చేపట్టారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:CM Jagan: మహాత్మా గాంధీ గారి మార్గంలోనే నడుస్తున్నాం..
గుజరాత్ లోని పోర్‌బందర్‌లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గాంధీజికి 13 సంవత్సరాల వయసులో కస్తూర్బా అనే యువతితో వివాహం జరిగింది. ఈయన1893లో లా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లారు. దాదాపు 22 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఒకసారి గాంధీజీ రైలులో ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తుండగా బ్రిటీష్ వాళ్ళు గాంధీజిని రైలు లోనుండి తోసేశారు. టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న గాంధీని కేవలం నల్లజాతి వాడని వాళ్ళు అలా రైలు నుండి తోసేశారు. ఈ ఘటన గాంధీని కలిచివేసింది. దీనితో జాతి వివక్షతను నిర్మూలించాలని సంకల్పించుకున్నారు. అనంతరం గాంధీజి 1915లో భారత దేశానికి వచ్చారు. ప్రజలు స్వదేశంలో బానిసలుగా ఉండడాన్ని చూసి చలించిపోయారు. ఎలాగైన భరత మాత బానిస సంకెళ్లను తెంచెయ్యాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలేని కలిసిన గాంధీజీ తన అభిష్టాన్నీ తెలిపారు.
Read also:UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!
కాగా దేశంకోసం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఒకసారి దేశంలో స్థితిగతుల గురించి తెలుసుకోవాలని.. అందుకోసం కనీసం ఒక సంవత్సరమైనా దేశంలో పర్యటించి దేశంలో ఏం జరుగుతుందో పరిశీలించాలని.. అప్పుడే ఏం చెయ్యాలో అర్ధమౌతుందని గోపాలకృష్ణ గోఖలే సలహా ఇచ్చారు. గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సలహానుసారం ముంబై నుండి తన పర్యటన ప్రారంభించి దేశం మొతం పర్యటించారు. పర్యటన అనంతరం 1917లో బీహార్‌లోని చంపారన్ జిల్లా నుంచి గాంధీజీ తొలి ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమమే సత్యాగ్రహం. అనంతరం గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంతో సహా వివిధ స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. గాంధీజీ ఆధ్వర్యంలో భారతదేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. దేశంలో అంటరానితనం నిర్మూలనకు కూడా ఎనలేని కృషి చేశారు గాంధీజీ. అంటరాని తనాన్ని రూపుమాపేందుకు వాళ్ళను హరిజనులు అనిపిలవడం ప్రారంభించారు. హరిజనులు అంటే దేవుని పిల్లలు అని అయన తెలియచేసారు. భారతదేశంలో చేనేత పరిశ్రమను పునరుద్ధరించడానికి మహాత్మా గాంధీ కూడా కృషిచేశారు, ముఖ్యంగా ఖాదీపై దృష్టి పెట్టారు. అహింసను ఆయుధంగా మలుచుకుని స్వాతంత్రాన్ని సంపాదించిన గాంధీజీ పుట్టినరోజును “అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా జరుపుకుంటారు.