NTV Telugu Site icon

MI vs RCB: మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ చిలిపి పనులు..! వీడియో వైరల్

Kohli

Kohli

విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో పిచ్చి.. అతని ఆటను చూసేందుకు ఎక్కడికైనా వెళ్లే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. అతని ఫొటోను చేతులపై, గుండెలపై టాటూలు వేసుకున్న పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగాడంటే చాలు.. అభిమానులు విరాట్ విరాట్ అంటూ.. ఎంకరేజ్ చేస్తుంటారు. కోహ్లీకి కూడా గ్రౌండ్లో ఉండి అభిమానులను ఉత్సహపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రౌండ్లో డ్యాన్స్లు, క్రికెటర్లతో జోక్స్ చేస్తూ కనిపిస్తాడు.

Read Also: Jasprit Bumrah: ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా విజయ రహస్యమేంటంటే..?

తాజాగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైవ్ మ్యాచ్లో నాన్ స్ట్రైకర్గా ఉన్న రోహిత్ శర్మను గిల్లుకుంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. టీమిండియాలో వీరిద్దరూ చాలా కాలంగా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య సన్నిహిత్యం ఎలా ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Read Also: Rakul Preet Singh : పెళ్లయ్యాక రకుల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి?

కాగా.. గురువారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. 9 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. బ్యాట్‌తో అభిమానులను అలరించలేకపోయినా.. ఇలాంటి ఫన్నీ వీడియోలతో హైలెట్ అయ్యాడు. ఈ సీజన్‌లో బెంగళూరు నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.