NTV Telugu Site icon

Mamata Banerjee: 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై మమతా బెనర్జీ ఏమన్నారంటే..!

Mamatha

Mamatha

Mamata Banerjee: నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు. మమతా.. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Cyclone Michaung: ముంచుకొస్తున్న తుఫాన్.. జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ గెలిచేది.. కానీ, ఇండియా కూటమి పార్టీలు కొన్ని ఓట్లను చీల్చాయని, ఇది నిజం అన్నారు. సీట్ల షేరింగ్ గురించి ఆ పార్టీతో మాట్లాడం.. ఓట్లు చీలడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి భావజాలంతో పాటు వ్యూహం కూడా ఉండాలని తెలిపారు. కాగా.. సీట్ల పంపకం సరైన రీతిలో షేరింగ్ జరిగితే 2024లో బీజేపీ అధికారంలోకి రాదని దీదీ తెలిపారు.

Cyclone Michaung: ముంచుకొస్తున్న తుఫాన్.. జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం..

అంతకుముందు.. బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై.. ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ సెల్యూట్ అంటూ సందేశం ఇచ్చారు. అంతేకాకుండా.. చారిత్రక, అపూర్వ విజయంగా కొనియాడారు. దేశాన్ని కులాల వారీగా విభజించేందుకు ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ.