NTV Telugu Site icon

Energy Drink: తరచూ ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమౌతుందో తెలుసా?

New Project (2)

New Project (2)

ఇటీవల చాలామంది ప్రజలు తీరిక లేని బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో ఆహారం, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టట్లేదు. పని ఒత్తిడితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. ఇలాంటప్పుడు రీఫ్రెష్‌మెంట్ కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ (Energy drinks) తాగుతున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ ఇన్‌స్టంట్ ఎనర్జీ అందిస్తాయి, చురుకుదనాన్ని పెంచుతాయి. వీటిలో కెఫీన్, చక్కెర, ఎడిటివ్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని రీఫ్రెష్ చేస్తాయి. అయితే ఎనర్జీ డ్రింక్స్ తాగితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అతిగా తాగితే గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. గుండె ఆగిపోవడం వంటి ప్రాణాంతక సమస్య కూడా రావచ్చు.

READ MORE: PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

ఇవి కాలేజీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత తగ్గటానికి, నిద్రలేమికి దారితీస్తున్నట్టు పెద్దఎత్తున నిర్వహించిన నార్వే అధ్యయనం హెచ్చరిస్తోంది. వీటిని ఎంత తరచుగా తాగితే అంత ఎక్కువగా రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నెలకు 1-3 సార్లు తాగినా నిద్రాభంగం ముప్పు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎనర్జీ డ్రింక్స్ ల్లో చక్కెర, విటమిన్లు, ఖనిజాలతో పాటు కెఫీన్‌ కూడా ఉంటుంది. సగటున ఒక లీటరుకు 150 మి.గ్రా. కెఫీన్‌ కలుపుతుంటారు. ఇవి శారీరక, మానసిక శక్తిని అందిస్తాయని ప్రచారం చేయటం వల్ల విద్యార్థులు, యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే కెఫీన్‌ నిద్రకు చేటు చేస్తుంది. ఎనర్జీ పానీయాలు నిద్రను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ ఎంత మేరకు ప్రభావం చూపుతున్నాయన్నది తెలియదు. దీన్ని గుర్తించటానికే 18-35 ఏళ్లకు చెందిన 53,266 మందిని ఎంచుకొని అధ్యయనం నిర్వహించారు. ఎంత తరచుగా ఎనర్జీ పానీయాలు తాగుతున్నారు? ఎంత బాగా నిద్రపోతున్నారు? అనేవి పరిశీలించారు. ఈ పానీయాలను తాగనివారు, ఎప్పుడో అప్పుడు తాగేవారితో పోలిస్తే.. రోజూ తాగేవారు సుమారు అరగంట తక్కువగా నిద్ర పోతున్నట్టు తేలింది. నిద్ర పట్టిన తర్వాత మెలకువ రావటం, చాలాసేపటి వరకు తిరిగి నిద్ర పట్టకపోవటం కూడా వీరిలో కనిపిస్తున్నట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో వాటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.