Triptii Dimri : యానిమల్ మూవీ లో హాట్ బ్యూటీ త్రిప్తి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి మెప్పించింది. రష్మిక తో పాటు ఈ మూవీలో మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రి జోయా అనే పాత్రలో నటించింది.ఈ భామ రణ్‌బీర్ కపూర్ తో కొన్ని హాట్ సీన్లలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.ఈ జోయా పాత్ర కోసం త్రిప్తి డిమ్రి తీసుకున్న మొత్తం కేవలం రూ.40 లక్షలు అని లైఫ్‌స్టైల్ ఏషియా తన రిపోర్టులో వెల్లడించింది. యానిమల్ మూవీలో ఆమె పాత్ర ఎంతోమందిని ఆకట్టుకుంది. తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో త్రిప్తి టాప్ లో ఉండటం విశేషం. ఆమె తర్వాతి స్థానంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నారు.
యానిమల్ మూవీతో ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన త్రిప్తి.. అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో నూ ఈ సినిమాలో ఆమె చాలా బోల్డ్ పాత్రలో కనిపించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా పోలిస్తే ఇది కేవలం పదో వంతు మాత్రమే అని తెలుస్తుంది.యానిమల్ కోసం రష్మిక రూ.4 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.అలాగే హీరో రణ్‌బీర్ కపూర్ రూ.70 కోట్లు, విలన్ బాబీ డియోల్ రూ.4 కోట్లు మరియు అనిల్ కపూర్ రూ.2 కోట్లు అందుకున్నట్లు సమాచారం. యానిమల్ ద్వారా త్రిప్తికి వచ్చిన డబ్బు తక్కువే అయినా కూడా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది.ఈ సినిమా తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా ఏకంగా 30 లక్షలు పెరిగారు. యానిమల్ రిలీజ్ కు ముందు 6 లక్షలుగా ఉన్న ఫాలోవర్లు గురువారానికి (డిసెంబర్ 14) ఏకంగా 37 లక్షలకు చేరడం విశేషం.
Also Read
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
తాజావార్తలు
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!