NTV Telugu Site icon

Ram Mandir: అయోధ్య బాలరాముడికి అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా…?

Donation

Donation

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారిలో సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ లాఖీ అనే వ్యక్తి మొదటిస్థానంలో ఉన్నారు. అతనొక ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయనొక్కరే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. కాగా.. ఈ బంగారం విలువ రూ.68 కోట్లు ఉంటుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో ఇదే ఎక్కువ. కాగా.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ అందించిన బంగారాన్ని బాల రాముని మందిరంలో గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, ఢమరు, త్రిశూలం వంటి నిర్మాణాల్లో ఉపయోగించారు.

Read Also: PM Narendra Modi: శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరాముని ఆశీస్సులతో శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసిన ప్రధాని మోడీ…

అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా చాలా మంది భక్తులు చాలా విరాళాలు ఇచ్చారు. కాగా.. అందులో ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు కూడా ఉన్నారు. ఆయన రూ.11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో ఉన్న ఆయన రామభక్త అనుచరులు రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళమిచ్చారు. యూపీలో ఒక వ్యక్తి రామమందిరం కోసం రూ.కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అప్పటికీ రూ. 15 లక్షలు తక్కువవడంతో అప్పుగా తీసుకొచ్చి రూ.కోటి జమ చేసి ఇచ్చాడు. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారని విశ్వహిందూ పరిషత్‌ చెబుతుంది.

Read Also: Yogi Adityanath: అయోధ్యలో ఇకపై బుల్లెట్ల మోతలు, కర్ఫ్యూలు ఉండవు..ములాయం సింగ్‌పై విమర్శలు..