The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ను కూడా ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతును ఇస్తే ప్రతిపక్షాలు మాత్రం ఎన్నో విమర్శలు చేసాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రదర్శనపై అక్కడక్కడా గొడవలు కూడా జరిగాయి.ఈ విధంగా ది కేరళ స్టోరీ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.. అయితే సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ సినిమా కి లాంగ్ రన్లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని సమాచారం.. ఇలా థియేటర్లలో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.
థియేట్రికల్ రన్ ముగియడంతో జూన్ 23 నుంచి ది కేరళ స్టోరీ జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ది కేరళ స్టోరీ ను విపుల్ అమృతలాల్ షా నిర్మించిన విషయం తెలిసిందే.. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని మరియు సోనియా బలాని వంటి వారు ఈ సినిమా లో కీలక పాత్రాలు పోషించారు. మరి థియేటర్లలో ది కేరళ స్టోరీ ను చూడటం మిస్ అయిన వారు అలాగే ఈ సినిమాను మళ్లీ చూడాలనుకునే వారు ఓటీటీ లో చూడటానికి బాగా ఎదురు చూస్తున్నారు.
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!