NTV Telugu Site icon

chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్

Chai Chapati

Chai Chapati

chai-chapati: టీ, చపాతీ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. కాబట్టి చాలా మంది చపాతీని బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో పాటు తినేందుకు ఇష్టపడతారు. అయితే టీతో చపాతీలు తింటే ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. టీ మరియు చపాతీ ఎందుకు అనారోగ్యకరమైన ఫుడ్ కాంబినేషన్ అని నిపుణులు సూచించారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, రక్తం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పరాటాలు, చపాతీలు మొదలైన భారీ ఆహారాలతో టీ తీసుకోవడం వల్ల కడుపులో తీవ్రమైన ఉబ్బరం.. యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడవచ్చు. ఎందుకంటే టీ లేదా కాఫీతో పరాటాలు లేదా చపాతీలు తినడం వల్ల కడుపులో యాసిడ్-బేస్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. టీలోని ఫినాలిక్ రసాయనాలు కడుపులో ఐరన్-కాంప్లెక్స్‌ల ఏర్పాటును ప్రేరేపిస్తాయి. ఇది శరీరంలో ఐరన్ శోషణను నిరోధిస్తుంది. అందువల్ల, టీని భోజనంతో పాటు తినకూడదు. ముఖ్యంగా ఐరన్ లోపం(రక్తహీనత) ఉన్నవారు.

Read Also: TSPSC: టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్లో.. ఓఎంఆర్ షీట్ మింగిన అభ్యర్థి

టీలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. చపాతీతో టీ తీసుకుంటే, అది శరీరంలో ప్రోటీన్ శోషణను అడ్డుకుంటుంది. ఇది ప్రొటీన్‌తో కలిసి శరీరంలో యాంటీన్యూట్రియెంట్‌గా పనిచేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, టానిన్ ప్రోటీన్ జీర్ణక్రియను సగటున 38% తగ్గిస్తుంది. టీ శరీరం పోషకాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది. కాబట్టి టీతో చపాతీ తీసుకోవడం మంచి కాదని డైటీషియన్స్ హెచ్చరిస్తున్నారు.

టీ ఎలా తీసుకోవాలి?
ఏదైనా ఆహారం తిన్నాక కనీసం 45 నిమిషాల తర్వాతే టీ తాగాలి. అల్పాహారం లేదా భోజనం తర్వాత ఒక గంట తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్‌తో టీ తీసుకోవడం ఉత్తమం.