BJP PARTY: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి (96) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారతరత్న అవార్డుతో అద్వానీని మోడీ సర్కార్ గౌరవించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌కే అద్వానీ రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అని పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు అద్వానీ ఎదిగారు అనే విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు.
Read Also: Sankranthi 2025: వచ్చే ఏడాదికి పోటి పడబోతున్న స్టార్ హీరోలు వీరే..
అయితే, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడుగా లాల్ కృష్ణ అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చిన తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. ఇక, 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది.
Read Also: MLC Kavitha: నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా లేదా చెప్పండి..
బీజేపీ ఏర్పాటులో అద్వానీ పాత్ర..
కాగా, ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరు పడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం దొరికింది. కానీ, బీజేపీ ఏర్పాటు ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. 1982లో బీజేపీకి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం లభించింది. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచారు. 1989లోనే అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించారు.
Read Also: Windfall Tax : ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రప్రభుత్వం
ఇక, 1990వ సంవత్సరంలో ఎల్ కే అద్వానీ రథయాత్ర చేసి దేశంలో సంచలనం సృష్టించారు. ఇక, 2002లో అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. అలాగే, 2004లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా పని చేశారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. అలాగే, 2015లో ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డు ప్రకటించింది.
Read Also: INS Sandhayak: ఐఎన్‌ఎస్ సంధాయక్‌ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
అలాగే, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భారతరత్నను ప్రకటించడం ఇది రెండోసారి. ఇంతకు ముందు బీహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్టు జనవరి 23న మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ అందుకోగా.. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ప్రముఖులు ‘భారతరత్న’ అందుకున్నారు.
