Toothpaste : సక్రమ వరుస కలిగిన దంతాలే మోముకు అందాన్ని తీసుకురాగలుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ దంతాలను జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతిరోజూ వాటిని శుభ్రం చేయడానికి తమకు ఇష్టమైన టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఎక్కువ నురుగుతో కూడిన టూత్‌పేస్ట్‌ను ఇష్టపడతారు. కొందరు దాని నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనేక బహుళజాతి కంపెనీలు టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తాయి. ఏ టూత్‌పేస్ట్ మంచిదో కొన్ని సార్లు అర్థం కాదు. అలాంటి సందర్భంలో నిపుణుల సలహా పాటిస్తే మంచింది.
Read Also: Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం
టూత్‌పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు ఏమి చేయాలి?
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, టూత్‌పేస్ట్‌ను కొనుగోలు చేసేటప్పుడు దాని బ్రాండ్, ఫ్లేవర్‌కు బదులుగా దానిలోని ఫ్లోరైడ్ కంటెంట్‌ను తనిఖీ చేయాలి. బ్రిటీష్ దంతవైద్యుడు డాక్టర్ ఖలీద్ ఖాసిమ్ ప్రకారం, ప్రజలు ఎల్లప్పుడూ ఫ్లోరైడ్ కలిగిన పేస్టును ఉపయోగించాలి. ఎందుకంటే ఫ్లోరైడ్ పళ్లలోని మురికిని శుభ్రపరుస్తుంది. దీనికి కారణం ఇందులో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్.. ఇది దంతాలను లోపల, వెలుపల శుభ్రపరుస్తుంది. దీంతో దంతాలు మెరుస్తూ శుభ్రంగా తయారవుతాయి. దంతాలను శుభ్రం చేయడానికి మార్కెట్లో అనేక బ్రాండ్ల టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు విభిన్న రుచులతో కూడిన టూత్‌పేస్ట్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇందులో లవంగం నూనె, వేప వంటి అనేక మూలికలు ఉన్నాయని పేర్కొన్నారు.
పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇవ్వండి
పిల్లల దంతాలు సున్నితంగా ఉంటాయి. అందువల్ల, వారికి తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ ఇవ్వాలి. పెద్దలకు అధిక ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌లు పని చేయగలవని ఖలీద్ చెప్పారు. సాధారణంగా 1350 నుంచి 1500 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ మంచిది. ఇది మరింత ప్రభావం చూపుతుంది. కానీ చిన్న పిల్లలకు 1000 పీపీఎం పేస్ట్ ఇస్తే మంచిది.
Read Also: Somu Veerraju: హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి
బూడిద లేదా ఇతర పదార్థాలతో దంతాలను శుభ్రం చేయడం తప్పు
దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ దంతాలకు ఎక్కువ ప్రమాదం ఉన్నట్లయితే, మీరు ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. డా. ఖలీద్ ప్రకారం, ముతక బూడిద లేదా ఇలాంటి పదార్థాలు దంతాలను చేరుకుంటాయి. ఇది దంతాలను శుభ్రం చేయడానికి బదులుగా వాటిని దెబ్బతీస్తుంది. కాబట్టి టూత్‌పేస్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలంటే టూత్‌పేస్ట్ నాణ్యత కూడా బాగుండాలని చెప్పారు.