వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్ధం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా రాధా ఎప్పుడు బయటకు రాలేదని పోతిన మహేష్ ప్రశ్నించారు.
కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా 36వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఏపీలోని పలు చోట్ల వర్ధంతి వేడుకల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ చెరువు సెంటర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ‘వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు ఒక్క మాట మాట్లాడలేదు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడలేదు. రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా.. రాధా ఎప్పుడు బయటకు రాలేదు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి. ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది. ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారు. మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు బాధేస్తుంది’ అని పోతిన మహేష్ అన్నారు.
Also Read: Top Headlines @1PM: టాప్ న్యూస్!
‘రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి ఎన్నో ఉన్నాయి. రాధా పదవి గురించి మాట్లాడడం కాదు.. రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలి. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా?. మాకు పదవుల మీద వ్యామోహం లేదు, సీటు రాకపోయినా పోరాటం చేస్తున్నాం. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరం. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా. వంగవీటి రంగా అందరి వాడు కానీ.. సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు.