వర్షాకాలంలో మారుతున్న వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆహారం, పానీయాల విషయంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో జంక్ ఫుడ్ మరియు స్పైసీ ఫ్రైడ్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. వీటితో పాటు కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. వాటిని వర్షాకాలంలో ఆహారంగా తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ ఆ కూరగాయలను తిన్నట్లైతే.. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో తినని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
Harish Rao: తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
సలాడ్‌లో ముడి కూరగాయలు
చాలా మంది ఆహారంతో పాటు సలాడ్ ఎక్కువగా తింటారు. అనేక కూరగాయలతో మిక్స్ చేసిన ఈ పదార్థంలో.. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో ఇవి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకు ఈ ఆహార పదార్థాన్ని తీసుకోకపోవడం మంచింది.
వర్షాకాలంలో పుట్టగొడుగులకు నో చెప్పండి
వర్షాకాలంలో పుట్టగొడుగులను తినడం మానేయండి. ఎందుకంటే పుట్టగొడుగు అనేది ఒక రకమైన ఫంగస్. ఇది నేలకి చాలా దగ్గరగా పెరుగుతుంది. పుట్టగొడుగులలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వర్షపు రోజులలో ఈ ఆహారాన్ని తీసుకోక పోవడం మంచిది.
Triumph Bikes: భారత్‌లో విడుదలైన బజాజ్ ట్రయంఫ్ బైక్స్.. ధరెంతో తెలుసా?
వర్షాకాలంలో ఆహారం కంటే పచ్చి కూరగాయలు తక్కువగా చేయండి
మనం ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండటానికి ఎల్లప్పుడూ ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే వర్షాకాలంలో మాత్రం ఆకుపచ్చ కూరగాయలను తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పచ్చి కూరగాయలలో క్రిమి, కీటకాలు ఎక్కువగా ఉంటాయి. దానిల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన పెరుగు వర్షాకాలంలో హానికరం
పాల ఉత్పత్తులలో ఒకటి పెరుగు. దీనిలో పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. పెరుగు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం మానేయాలి. ఎందుకంటే పెరుగులో శీతలీకరణ ప్రభావం ఎక్కువగా ఉంటుది. దీంతో వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి.
