Site icon NTV Telugu

Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగా, DNA పరీక్షల ద్వారా ఇప్పటివరకు 163 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 124 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారు.

ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. దీనితో వాటిని గుర్తించడానికి పెద్ద సమస్యగా మారింది. దాంతో అధికారులు DNA పరీక్షలతోనే గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 163 DNA నమూనాలు సరితేలాయి. అందులో 124 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాం. మిగతావి త్వరలో అప్పగిస్తామని అన్నారు.

Read Also: Gang Rape: బీచ్‌లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్

ప్రమాదంలో గాయపడ్డ 71 మందిలో 9 మంది ఇంకా చికిత్స పొందుతుండగా, చికిత్స పొందుతూ ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో BJ మెడికల్ కాలేజ్‌కు చెందిన నాలుగు మంది MBBS విద్యార్థులు మరణించారని స్పష్టంగా తెలిపారు. జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం, కొన్ని నిమిషాల్లోనే ఒక మెడికల్ కాలేజ్ భవనంపై పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించగా, భూమిపై ఉన్న మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Uppena : ఉప్పెన మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో

ఘటన జరిగిన స్థలంలో ఇప్పటికే అధికారులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ను ప్రమాద స్థలంలో నుంచి వెలికితీశారు. ఇది ప్రమాదానికి కారణమైన అంశాలను తెలుసుకునేందుకు కీలకమైన ఆధారంగా భావిస్తున్నారు. DNA పరీక్షల ప్రక్రియ బుధవారం ఉదయం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని డాక్టర్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు వేగవంతంగా చేపడుతున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

Exit mobile version