Udhayanidhi Stalin Tamil Nadu Deputy CM: క్రీడల మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లే లోగా.. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వర్గాలు తెలిపాయి. సేలంలో జనవరి 21న జరగనున్మ డీఎంకే యూత్ వింగ్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయంపై డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ టీకేఎస్ ఎళంగోవన్ స్పందించారు. ‘ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా చేయనున్నారనే విషయం నాకు తెలియదు. ఉదయనిధి పార్టీలో చురుకుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే అతను ఉప ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది సీఎం మాత్రమే నిర్ణయిస్తారు’ అని ఎళంగోవన్ తెలిపారు. ఈ విషయంపై ఉదయనిధి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇవన్నీ పుకార్లే అని, ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకోవాలలి అని చెప్పారు.
Also Read: Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!
ఇక ఉదయనిధి స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) స్పందించింది. ‘ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆపై మంత్రిని చేశారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రిని కూడా చేస్తున్నారు. ఇక 2026లో అతడిని సీఎంని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉంది తప్ప ప్రజాస్వామ్యం లేదు’ అని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు.