Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజ్ భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం నేడు (ఆదివారం) జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో మరో ముఖ్యమైన అంశం సెంథిల్ బాలాజీ తిరిగి మంత్రివర్గంలోకి రావడం. బాలాజీకి గతంలో విద్యుత్, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు.…
Udhayanidhi Stalin Tamil Nadu Deputy CM: క్రీడల మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లే లోగా.. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వర్గాలు తెలిపాయి. సేలంలో జనవరి 21న జరగనున్మ డీఎంకే యూత్ వింగ్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై…