Site icon NTV Telugu

Liquor ATM: ఎనీ టైం మందు.. ఏటీఎం తీసుకొచ్చిన ప్రభుత్వం..

Liquor Atm

Liquor Atm

ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్‌ డైలాగ్‌ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్‌ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్‌ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట.. ఇప్పుడు చెన్నైలో ఈ ఎనీ టైం మందు మిషన్‌ ఏర్పాటు చేశారు.

కోయంబేడులోని ఓ మాల్ వద్ద తమిళనాడు ప్రభుత్వం ATM మందు మిషన్ ఏర్పాటు చేసింది.. నాలుగు ప్రాంతాలలో ATM తరహాలో మిషన్ ఏర్పాటు చేసింది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్.. ఈ మిషన్‌ దగ్గరకు వెళ్లి.. అందులో చూపించే.. బ్రాండ్‌లను నచ్చిన బ్రాండ్‌ను ఎంపికచేసుకునే వెసులుబాటు ఉంది.. ఇక, ఆ బ్రాండ్‌కు ఎంత మొత్తం చెల్లించాలో చూపిస్తుంది.. ఆ పేమెంట్‌ డిజిటల్‌ రూపంలో చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకున్న లిక్కర్‌.. డెలివరీ చేస్తుంది ఆ మిషన్‌.. అయితే మద్యం మిషన్ ఏర్పాటుపై బీజేపీ నేత, సినీనటి ఖుష్బూ సెటైర్లు వేశారు.. ప్రజలను మద్యానికి బానిసలుగా ఉంచడానికి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఐడియా సూపర్‌గా ఉందండీ అంటూ సోషల్‌ మీడియాలో ఎద్దేవా చేశారు. మరోవైపు, మద్యం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయాని డీఎంకే ఎంపీ కనిమోళి స్వయంగా అంగీకరించారు.. ఇలాంటి వాటి వల్ల తమిళ యువత ఆరోగ్యం నాశనం అవుతుందన్నారు. ఏదేమైనా.. ఎన్ని విమర్శలు ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో లిక్కర్‌ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్న విషయం విదితమే.

కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం మార్కెటింగ్ మరియు విక్రయాల సంస్థ TASMAC అమ్మకాలను పెంచడానికి మరో ప్రయత్నంలో, DMK ప్రభుత్వం చెన్నైలో ఆటోమేటెడ్ మద్యం యంత్రాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు ప్రభుత్వ మద్యం విక్రయ సంస్థ అయిన టాస్మాక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పిటిఆర్ పళనివేల్ త్యాగరాజన్ తమిళనాడు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.5000 కోట్లు పెరిగింది. దీని ప్రకారం, తమిళనాడులో టాస్మాక్ ద్వారా మద్యం అమ్మకాలు పెరిగేలా డీఎంకే ప్రభుత్వం ప్రభుత్వ నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాల్లో మద్యం సేవించేందుకు ప్రత్యేక లైసెన్స్ మంజూరు చేస్తూ డీఎంకే ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version