Site icon NTV Telugu

DK Aruna : ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కేసీఆర్ అనుకుంటున్నాడు

Dk Aruna Comments

Dk Aruna Comments

ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికే మళ్ళీ టికెట్ ఇచ్చారని, ఎస్సీ ఎస్టీ ల విషయం లో ఒకలా మిగతా వారి విషయం లో మరోలా వ్యవహరించాడని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కేసీఆర్ అనుకుంటున్నాడని, బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారు.. ముదిరాజ్ లకి ఒక్క సీటు ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. నేను ఎవరిని పెట్టిన నన్ను చూసి ఓటు వేయాలని ధోరణి లో కేసీఆర్‌ ఉన్నాడని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం తో నేను కొట్టినట్టు చేస్తా నువు ఏడ్చి నట్టు చేయి అనేలా నడుచుకుంటున్నారని, ముఖ్యమంత్రి బిడ్డ మహిళ రిజర్వేషన్ ల కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేసింది.. మద్యం కేసు ను తప్పు దోవ పట్టించేందుకు ఆమె ధర్నాలు అని ఆమె ఆరోపించారు.

Also Read : Poco M6 Pro 5G Price: పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ సేల్ మూడోసారి ఆరంభం.. క్రేజ్ మాములుగా లేదుగా!

ఇప్పుడు ఎందుకు మహిళలకు ఎందుకు టికెట్స్ ఇవ్వలేదు కేసీఆర్ కి బిడ్డ తప్పితే ఇతర మహిళల మీద విశ్వాసం లేదు… వారి సామర్థ్యం మీద నమ్మకం లేదని డీకే అరుణ ధ్వజమెత్తారు. ఎప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ను తెచ్చేది బీజేపీనేనని, రాష్ట్రపతి గా మహిళా అభ్యర్థిని పెడితే కేసీఆర్‌ వ్యతిరేకించారన్నారు. అధికారులకు రాజకీయ షోకు ఎక్కువ అయిందని, రాజకీయాల్లోకి రావాలి అంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రండని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లో జరుగుతున్న తప్పులను అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె అన్నారు.

Also Read : Pawan Kalyan: అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు!

Exit mobile version