నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టిన నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ మాట్లాడుతూ… నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం గత ఐదు రోజుల గా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అతడినీ పరామర్శించడానికి వెళ్తే నన్ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నాడు…ఈ దుబాయ్ షేక్ అని ఆమె అన్నారు. నిర్మల్ ఇందలవాయి వద్ద నన్ను పోలీసులు అడ్డుకున్నారని, పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రం లో భూ దందా చేస్తోందని ఆమె ఆరోపించారు.
Also Read : Ariyana Glory : కిర్రాక్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
అంతేకాకుండా.. ‘సీఎం కేసీఆర్ భూ దొంగ… తెలంగాణ భూములను కేసీఆర్ దోచుకుంటున్నారు… కాళేశ్వరం దోచుకోవడం అయే పోయింది… ప్రభుత్వ భూములను కార్పోరేట్ కు అమ్మతున్నడు… సీఎం కేసీఆర్ దుబాయ్ శేఖర్… నిర్మల్ వెళ్తుంటే నన్ను ఎందుకు అడ్డుకున్నారు? రైతుల తరపున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నారు… రైతు లు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ నీకు బాధ్యత లేదా… తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్ష చేశాడు… మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. 220 జీవో ను రద్దు చేయాలి… సీఎం కేసీఆర్ ఎందుకు భయ పడుతున్నారు… రైతుల కు రుణం మాఫీ చేయడానికి మద్యం టెండర్లు వేయేస్తున్నడు… తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి, కేసీఆర్ కు సిగ్గు లేదు… కేసీఆర్ ను గద్దె దించేవరకు తెలంగాణ ప్రజలు నిద్రపోరు… కేంద్ర పథకాలను పక్క దోవ పట్టిస్తున్నారు… తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం అనివార్యం… కేసీఆర్ మోసాలను ,కేటీఆర్ మోసాలను ప్రజల కు చెప్తాం…
Also Read : Greg Chappell: స్టార్ ప్లేయర్కు మాజీ కోచ్ సలహాలు.. కోహ్లీలా తిరిగి ఫామ్లోకి రావాలి
కేసీఆర్ కుటుంబ నికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి… ఒక మహిళ అని చూడకుండా పోలీసులు ఇష్టనుసరంగ వ్యవహరించారు… నిరాహార దీక్షను విరమణ చేయడానికి వెళ్తుంటే లాండ్ అండ్ ఆర్డర్ సమస్య వస్తది అని నన్ను అడ్డుకున్నారు… తెలంగాణ కేసీఆర్ అబ్బా జాగీరా… తెలంగాణ కు పట్టిన పిడ కేసీఆర్… కేసీఆర్ నియంత పోకడలు మానుకోవాలి… బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే… బీజేపీ అంటే కేసీఆర్ కు అంత భయం ఎందుకు… బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్స్టాండ్ ధర్నాలు చేస్తున్నారు.. బీజేపీ ధర్నాలు చేస్తుంటే బిఆర్ఎస్ ఓర్వడం లేదు… కేసీఆర్ తెలంగాణ కు చేసిన అభివృద్ధి ఏం లేదు… కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఖర్చు చేస్తుంది…ఈ ప్రభుత్వం చేసింది శూన్యం..’ అని ఆమె ధ్వజమెత్తారు.
