బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రాకముందు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read : Reliance: రిలయన్స్ మరో కొత్త బిజినెస్.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ నిజాయితీ ఏంటో భారతదేశ ప్రజలకు తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలిసి కూడా మోడీని విమర్శించడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు. తమ పార్టీకి అవినీతి మరక అంటిందని ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, ఏమీ లేనప్పుడు భయం ఎందుకు ? విచారణ ఎదుర్కొండి అని ఆమె అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మోడీ, ఈడీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Street Dogs : నిద్రపోతున్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. నిదర్శనం ఈ ఘటన
