DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు గతంలో కూడా ఫార్మా వద్దు వ్యవసాయం ముద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశలివారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. మూడు గ్రామాలలో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిని అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయం ఏమి తెలియదని అన్నారు. తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారని అన్నారు.
Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్
అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్మకం రైతులకు లేదని అన్నారు. ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ముందస్తుగా రైతుల మనో బావలను తెలుసుకోవాలని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీ నీ విరమించుకోవాలని అన్నారు తాను కూడా గతంలో కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించినప్పుడు పెద్దపెద్ద కంపెనీలను కూడా ప్రజల కోరిక మేరకు విరమించుకోవడం జరిగిందని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలని తెలిపారు అదేవిధంగా. దాడి ఘటనను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలని అన్నారు అంతేగాని అమాయక రైతులను బలి చేయవద్దని పేర్కొన్నారు.
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల