Do These Remedies on Diwali Morning for Immense Money: దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను నవంబర్ 12న జరుపుకోనున్నారు. హిందూ మతంలో అతిపెద్ద పండుగగా దీపావళి పరిగణించబడుతుంది. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ-సంతోషాలు, శాంతి-సౌభాగ్యాలు ఉంటాయని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే.. ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. మంచి ఆరోగ్యం, డబ్బుకు కొదవ ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి దీపావళి రోజు ఉదయం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం.
దీపావళి రోజు ఉదయం ఈ పని చేయండి:
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. దాంతో ఐశ్వర్యానికి లోటు ఉండదు. దీపావళి నాడు తులసి మొక్కను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున తులసిని పూజించడం మరియు నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరం.
Also Read: Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
# దీపావళి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేసి.. ఓ పాత్రలో నీరు తీసుకోండి. తులసి మొక్కకు సగం నీరు సమర్పించి.. మిగిలిన నీటిని ఇంటి అంతటా చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటుంది.
# దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంటి ప్రాంగణంలో రంగోలి (ముగ్గు) వేయడం శుభప్రదం. దీనితో లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకు లోటు ఉండదు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)