NTV Telugu Site icon

Diwali Offers 2024: ‘పండగ’ ఆఫర్లు.. 12 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

Diwali 2024 Offers

Diwali 2024 Offers

‘దీపావళి’ పండుగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ దీపావళి’ సేల్‌.. అమెజాన్‌లో ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా రియల్‌మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

Motorola G34 5G:
జనవరిలో ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలా మోటో జీ34 5జీను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం తగ్గింపు ఉంది. దాంతో 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999 ఉండగా.. మీకు రూ.11,999కి అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. దాంతో ధర మరింత తగ్గనుంది.

Realme Narzo N65:
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ నార్జో ఎన్65 స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ+128జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.14,999గా ఉంది. బిగ్‌ దీపావళి సేల్‌లో 23 శాతం తగ్గింపు తర్వాత.. రూ.11,499గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే రూ.750 అదనంగా తగ్గుతుంది.

Also Read: IPL Retention 2025: దీపావళి రోజే రిటెన్షన్ జాబితా.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చో తెలుసా?

Samsung Galaxy M15:
శాంసంగ్‌ గెలాక్సీ ఎం 15 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.16,999గా ఉంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో 29 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. రూ.11,999కే ఈ మొబైల్ మీ సొంతం అవుతుంది. రూ.500 కూపన్ కోడ్ ఆఫర్ కూడా ఉంది. ఇవే కాకుండా పలు స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీగా తగ్గింపులు ఉన్నాయి.

Show comments