జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అయితే.. డాక్టర్ బీర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నేడు మంత్రి తలసానితో బత్తిన సోదరులు భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి బత్తిన సోదరులకు హామీ ఇచ్చారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారని, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు.
మైసూర్‌పాక్ నుంచి గులాబ్ జామూన్ దాకా.. ఈ స్వీట్లు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసా..?
అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామన్న మంత్రి తలసాని.. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన అమర్నాథ్ గౌడ్ చెప్పారు.
Chetna Pande : బీచ్ ఒడ్డున అందాల సునామి సృష్టిస్తున్న చేతన పాండే
