GHMC: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను మేయర్ పంపిణీ చేశారు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్.. నేటి నుంచే అమలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పర్చడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.