NTV Telugu Site icon

Disha Patni : పూజకు వెళుతూ ఆ బట్టలేంటి.. కొంచమైనా ఉండాలి

Disha

Disha

Disha Patni : బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ నటీమణులలో దిశా పటానీ ఒకరు. చాలా తక్కువ సమయంలో దిశా పటానీ భారతీయులలో చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. దిశా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన తాజా ఫోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. గత కొద్ది కాలంగా పలువురు సినీ ప్రముఖులు దేశంలోని వివిధ దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిశా పటానీ ఇటీవల వారణాసిలో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. దిశా గంగా హారతి ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సమయంలో ఆమె ఓ పొరపాటు చేసింది. దాని కారణంగానే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Read Also: Taman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి షాకింగ్ నిజం చెప్పిన సింగర్ గీతామాధురి

వారణాసిలోని ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతి చేస్తున్న దిశా పట్నీ వీడియో వైరల్ అవుతోంది. దిశ భక్తితో గంగా మాతకు హారతి అందిస్తోంది. అదే సమయంలో అక్కడనున్న వారి దృష్టి దిశ ధరించిన దుస్తులపై పడింది. దిశా గంగా మాతకు హారతి ఇస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ సమయంలో దిశ క్రాప్ టాప్, మ్యాచింగ్ ప్యాంట్ ధరించారు. వాటితో పాటు ఓ శాలువా కూడా తీసుకెళ్లారు. హారతి సమయంలో క్రాప్ టాప్ ధరించినందుకు దిశా పటానీ ట్రోల్ చేయబడుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హారతి సమయంలో క్రాప్ టాప్ వేసుకోవడం తగదని, సంప్రదాయ దుస్తులు ధరించాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రోలర్లకు దిశా పటానీ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

Read Also: Meena Daughter : కూతురు మాటలకు బోరున ఏడ్చేసిన మీనా

దిశా పటానీ 2016లో ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఆమె ‘బాఘీ 2’, ‘బాఘీ 3’, ‘మలంగ్’ వంటి అనేక చిత్రాలలో కనిపించింది. దిశా చివరిసారిగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రంలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. త్వరలో దిశా ‘యోద్ధ’, ‘కంగువ’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లో కనిపించనుంది.