Meena Daughter : కూతురు మాటలకు బోరున ఏడ్చేసిన మీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meena Daughter : బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందారు మీనా. దాదాపు 30ఏళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అప్పటి టాప్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అందరితో నటించింది. కెరీర్ ఉన్నతంగా ఉన్నప్పుడే 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ విద్యాసాగర్‌ను వివాహమాడింది. వీరు నైనికా అనే పాపకు జన్మనిచ్చారు. గతేడాది జూన్‌లో మీనా భర్త విద్యాసాగర్ మృతిచెందాడు. భర్త మరణించిన బాధనుంచి విముక్తి పొందేందుకు మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మార్చినెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలంతా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పాల్గొన్నారు. ఆ వేడుకలో మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు.
Read Also: Kattappa : ఖల్ నాయక్ మిస్ చేసుకున్న కట్టప్ప క్యారెక్టర్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మీనా గురించి తన కూతురు నైనిక మాట్లాడుతూ.. ‘నువ్వు హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పటికి నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు గర్వపడుతున్న. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్ తింటూ కూర్చున్నా. ఆ రోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు.. నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.’ అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్ శ్రీదేవి, ప్రభుదేవా హాజరయ్యారు.
அம்மா வந்து ஒரு Heroine ah இருக்கலாம்.. ஆனா உங்கள மாதிரி ஒரு Human தான்.. அவங்களுக்கும் Feelings இருக்கு 🥲❤️❤️ #meena #nainika #meena40 #ladysuperstar #மீனா pic.twitter.com/rYZA4Avrk2
— Kamala மீனா (@MeenaNavy) April 22, 2023
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!