NTV Telugu Site icon

Disha App Event: దిశ యాప్ మహిళలకు రక్షణ కవచం

Disha 1

Disha 1

రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నుపూర్ అజయ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ..దిశ SOS యాప్ ఎంతో ముఖ్యం. దిశ యాప్ డౌన్ లోడ్ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో వేగవంతం చేశాం. దిశ యాప్ పై ప్రజలకు కొన్ని అపోహలు ఉన్నాయి. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే మొబైల్ సమాచారం పోలీసులకు వెళుతుందనే అపోహలలో వాస్తవం లేదన్నారు. మొబైల్ లో నెట్ లేకపోయినా దిశ యాప్ పనిచేస్తుంది. సీపీ కాంతి రాణా టాటా దిశ యాప్ గురించి వివరించారు.

మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల నుండి పుట్టిన ఆయుధం దిశ యాప్.దిశ యాప్ మహిళలకు రక్షక కవచం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు,ఒంటరి మహిళలు,యువతులు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి మహిళ దిశ SOS యాప్ ను స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకొని బాధిత మహిళను పోలీసులు రక్షించడం జరుగుతుంది. దిశ యాప్ అనేది బాధ్యతగా ప్రతి ఒక్కరు డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.

Rajya Sabha :రాజ్యసభలో మేధావులు తగ్గిపోతున్నారా.. పెద్దల సభకు అర్హతలేంటి..?