NTV Telugu Site icon

AP Assembly: అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. టీడీఆర్ బాండ్లపై చర్చ

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీఆర్‌ బాండ్లపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకూ 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని.. దీనిపై శాఖాపరమైన చర్యలు, ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు. ఏసీబీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని.. తణుకులో ముగ్గురు అధికారులను ఈ వ్యవహరంలో సస్పెండ్ చేశామన్నారు.

Read Also: Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో 37 మందిని విచారించనున్న పోలీసులు

టీడీఆర్ బాండ్ల వెనుకున్న వ్యక్తులు ఎవరనేది మనందరికి తెలుసని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు జారీ చేశారని.. దీని విలువ తీసుకుంటే టీడీపీ హాయంలో 6000 గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చామన్నారు. గతంలో సంవత్సర కాలంలోనే 1 లక్ష, 48వేల 400 గజాలు వరకూ బాండ్లు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీ పేరుతో 25 కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారని చెప్పారు. ఈమొత్తం వ్యవహరంలో సూత్రధారి ఎవ్వరో తేల్చారా లేక అధికారులపై చర్యలు మాత్రమేనా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ భూములన్నీ సంవత్సర కాలంలోనే చేతులు మారాయని, రిజిస్ట్రేషన్లు చేశారని పేర్కొన్నారు. ఈ భూముల పరిస్ధితి తెలియజేయాలని కోరుతున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భాగంగా అడిగారు. టీడీఆర్ బాండ్ల విషయంలో సూత్రధారులు, పాత్ర ధారులపై చర్యలు తీసుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య డిమాండే చేశారు. విశాఖలో మాడిఫికేషన్‌ను ఆసరాగా తీసుకొని రెస్ట్రిక్టడ్ జోన్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖపట్నం మెయిన్ రోడ్డు మీద సీబీసీఎన్సీ అనే క్రిష్టియన్ మైనార్టీ సంస్ధ ఉందని.. ఈ రోడ్డుకు 60 కోట్ల టీడీఆర్ బాండ్ల ఇష్యూ చేశారని అన్నారు. ఈ విషయంలో చిన్న బిల్డర్లను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళారని తెలిపారు.

ఈ ప్రశ్నలకు పురపాల శాఖ మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. తణుకులో టీడీఆర్ బాండ్లు 29 ఇచ్చారని.. 4500 స్క్వేర్‌ యార్డు ఉంటే 1.4 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇంటిని చూపించి అక్కడి రేటు పెంచారన్నారు. దీంతో దీని విలువ అసాధారణంగా పెరిగిందన్నారు. 63.24లక్షలకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి ఉండగా 754 కోట్ల 67 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై 691కోట్ల 43 లక్షల స్కాం తణుకులో గుర్తించామని చెప్పారు. నాలుగు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీటుగా రిలీజ్ చేయొద్దని చెప్పామన్నారు. రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామన్నారు.