వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు. ఆ సమయం దగ్గర పడుతుండడంతో చైర్మన్ గుంటి రజినీ కిషన్ తో సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఇక, క్యాంపుకి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి వచ్చి అవిశ్వాసనికి సహకరించాలని లేకపోతే రాజీనామాలు చేస్తాం అని మిగితా కౌన్సిలర్లు చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్‌లు ఆడగలడు!
ఇదీ ఇలా ఉండగా నిన్న (సోమవారం) మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎంపీ మాలోతు కవితను 14 మంది కౌన్సిలర్లు కలిశారు. క్యాంపుకు వెళ్లిన వారిని పార్టీ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నాయకులు తెలిపారు. అవిశ్వాస వర్గంలో వారికి విప్ జారీ చేసినట్లు తెలిపిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ రోజు అవిశ్వాసం జరుగుతుందా లేక సర్ధు బాటు చేసుకుంటారా అని నర్సంపేట ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మెన్లు పార్టీ మారుతున్నారు.