NTV Telugu Site icon

Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనంలో అపశృతి.. బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Read Also: Putin: రష్యా ప్రజలకు దేశాధ్యక్షుడు పుతిన్ కీలక పిలుపు

లక్ష్మీదేవిపల్లి మండలం రెగ్గళ్ల బొడ్రాయి సెంటర్‌లో వినాయక శోభాయాత్ర సందడిగా సాగుతుంది. అందరూ గణేష్ వాహనం ముందు ఆనందంగా స్టెప్పులేస్తున్నారు. ఇంతలోనే వాహంలోని బాణాసంచాకు నిప్పుంటుకుని పేలుడు సంబంవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మురో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి డీజే బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Read Also: Kim : చంపేస్తావా కిమ్ మావా..!?

Show comments