Nellore: నెల్లూరులోని బర్మాషెల్ గుంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని పదిహేనేళ్ల దివ్యాంగురాలు నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పూరిగుడిసెల్లోనే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూరిగుడిసెలు కావడంతో మంటలు వ్యాపించడంతో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెల్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. బీరువాల్లోని బట్టలు, ఇతర సామాగ్రి కూడా దగ్ధమయ్యాయి.
Read Also: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
అగ్ని ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని అన్నీ విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ప్రతీ ఇంటికి రూ. 15వేలు, మృతి చెందిన దివ్యాంగురాలికి రూ. 30వేలు ఇస్తామని ప్రకటించారు.