NTV Telugu Site icon

Director Venky Atluri Engagement: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ డైరెక్టర్‌.. అమ్మాయి ఎవరంటే

Venki Atluri

Venki Atluri

Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ‘స్నేహ గీతం’ సినిమా తర్వాత ఆయన వరుణ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్‌ మజ్ను’, నితిన్‌తో ‘రంగ్‌దే’ సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ధనుష్‌తో సార్‌ సినిమా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి వివాహా బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు.

Read Also : Shivaji Raja: శివాజీ రాజా అప్పుడలా.. ఇప్పుడిలా

పూజా అనే అమ్మాయితో త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. కొద్దిమంది సినీ ఇండస్ట్రీ సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా, నిరాండబరంగా వెంకీ అట్లూరీ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. వెంకీ అల్లూరీ నిశ్చితార్థం ఫొటోలు చూసి సినీ నటీనటుల, ప్రముఖు, ఫాలోవర్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భార్య, మహానటి, సీతారామం చిత్రాల నిర్మాత స్వప్నదత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.