Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!
- నవంబర్ 28న నానా హైరానా రిలీజ్
- అద్భుతమైన లొకేషన్స్‌లో సాంగ్ షూట్
- శంకర్ రేంజ్ సాంగ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్.
ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి, రా మచ్చా సాంగ్స్‌ను భారీ సెటప్‌తో షూట్ చేశాడు. కానీ ఇవి శంకర్ రేంజ్ సాంగ్స్ కాదన్నట్టుగా.. ఎక్కడో చిన్న అసంతృప్తి మాత్రం అభిమానుల్లో ఉంది. ఇప్పుడు అసలు సిసలైన శంకర్ రేంజ్ సాంగ్ బయటికి రాబోతోంది. ఈసారి తమన్ ఇచ్చిన ట్యూన్ మామూలుగా ఉండేలా లేదు. ‘నానా హైరానా’ అంటూ సాగే థర్డ్ సింగిల్ ప్రోమోను టాగ్ రిలీజ్ చేయగా.. అదిరిపోయింది. సూపర్ మెలోడీగా ఈ సాంగ్ ఉండబోతోంది. ప్రముఖ సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ ఈ పాట పాడారు. న్యూజిలాండ్‌లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సాంగ్ షూట్ చేశారు. ఈ లిరికల్ సాంగ్‌ను నవంబర్ 28న రిలీజ్ చేయనున్నారు. ఖచ్చితంగా ఈ సాంగ్ శంకర్ మార్క్ ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
Also Read
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
- Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
- Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
- Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
Also Read: Nayanthara Case: నయనతారపై సివిల్ కేసు నమోదు!
గేమ్ ఛేంజర్ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. విడుదలకు సమయం చాలానే ఉన్నా.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం అమెరికాలో భారీ ఎత్తున నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. మన దగ్గర అయితే అంతకు మించి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ లేట్ అవుతుండడంతో మెగా ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!