Site icon NTV Telugu

RGV : తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్‌ కుమారుడిపై ఆర్జీవీ కామెంట్స్‌

Rgv Bandi Sanjay Son

Rgv Bandi Sanjay Son

తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌ తనయుడు బండ భగీరథ్‌కు చెందిన ఓవీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బండి భగరథ్‌ ఓ విద్యార్థిని నానా బూతులు తిడుతూ చితకబాదుతున్నాడు. అయితే.. దీనిపై తాజాగా వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ‘ఇరాక్ నియంత సద్దామ్ హుస్సేన్ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ అతడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు’ అని ఆర్జీవ్‌ ట్విట్టస్త్రాలు సంధించారు. అయితే.. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతోన్న బండి భగీరథ్.. ఓ విద్యార్థిని తిడుతూ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వీడియోలో దెబ్బలు తిన్న విద్యార్థి ఈ వీడియోపై స్పందిస్తూ.. తప్పు తనదేనని, భగీరథ్‌ ఫ్రెండ్‌ చెల్లెకు మెసేజ్‌లు చేయడంతో తనను భగీరత్‌ వారించాడని వివరించారు.

Also Read : Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దుపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేకు మెసేజ్ లు పంపిన రైతులు

అదేసమయంలో నేను మాట్లాడిన దానికి కోపంతో భగీరథ్‌ తనను కొట్టినట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతుందని, ఇప్పుడు మేము ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చాడు సదరు విద్యార్థి. అయితే.. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. పిల్లలుపిల్లలు కొట్టుకుంటే నాన్‌బెలబుల్‌ కేసులు పెడుతారా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొజిజర్‌ ప్రకారం పేరెంట్స్‌ను పిలిచి మాట్లాడారా అంటూ ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల గొడవను రాజకీయం చేస్తున్నారని, రాజకీయాల్లో తమను ఎదుర్కొలేక పిల్లలపై కక్ష్యసాధింపు చేస్తున్నారన్నారు బండి సంజయ్‌.

Also Read : Bandi Sanjay : తన కొడుకు ఘటనపై స్పందించిన బండి సంజయ్‌

Exit mobile version