NTV Telugu Site icon

Jai Hanuman: కన్నడ స్టార్‭కు ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్‌వర్మ

Jai Hanuman

Jai Hanuman

Jai Hanuman: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా నిర్మాణంలో ఉంది. ఇదివరకే ఈ సినిమా హనుమాన్ ను మించి ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ఆంజ‌నేయ స్వామి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న చ‌ర్చ‌లో ఇప్పటికే ప‌లువురు స్టార్ హీరోల పేర్లు తెర‌పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎట్టకేలకు ఆంజ‌నేయ స్వామి పాత్ర‌లో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలిపే పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది.

Read Also: India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్

అయితే, రాముడికి హనుమంతుడు ఏమని వాగ్దానం చేసాడన్న విషయానికి “జై హనుమాన్” సినిమా సమాధానం కానుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. తన ప్రాజెక్ట్‌లో నటిస్తునందుకు రిషబ్ శెట్టికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ లో.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టికి ధన్యవాదాలు. అతని అంకితభావం, హనుమంతుని పట్ల అసమానమైన భక్తి ఈ పాత్రకు నిజంగా ప్రాణం పోసింది. అతని అద్భుతమైన పరివర్తన, పరిపూర్ణత, తిరుగులేని నిబద్ధత ‘జై హనుమాన్‌’ను అత్యద్భుతంగా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు మరపురాని అనుభూతిని అందించడానికి అతను తన వంతు కృషి చేసాడని, నేను మీతో ఈ ప్రయాణం ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానట్లు రాసుకొచ్చారు. ఇందులో భాగంగా సినిమా తొలి ఫోటో షూట్‌లోని ఓ ఫోటోను షేర్ చేశాడు.

Show comments