పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా వున్నాడు. `సలార్`, “కల్కి 2898 AD”, వంటి సినిమాల గ్లింప్స్ వీడియోస్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు పెంచేసాయి.అయితే ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న మూవీ(రాజా డీలాక్స్) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.కనీసం ప్రారంభమైందనే వార్తకు రాలేదు, షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది.ఏం జరుగుతుందనే అప్ డేట్ టీమ్ నుంచి అస్సలు రావడం లేదు. వాళ్లు ఈ సినిమాని ఎంతో సీక్రెట్‌గా తెరకెక్కిస్తున్నారు. అనేక సందర్భాల్లోనూ నిర్మాతలు, దర్శకుడు ఈ సినిమాపై స్పందించేందుకు కూడా నిరాకరించారు. మంచి సందర్భంలో ఆ సినిమా గురించి మాట్లాడతామని వారు చెబుతున్నారు.ఈ క్రమంలో ఇన్నాళ్లకి దర్శకుడు మారుతి ఈ సినిమా ఓపెన్ అయ్యాడు. సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. సినిమా జోనర్, షూటింగ్, రిలీజ్ వంటి అంశాలను ఆయన వెల్లడించారు. దీంతోపాటు సినిమాపై వచ్చిన రూమర్లకి కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే ప్రభాస్ సినిమా గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కాదు, సెపరేట్ ఇంటర్వ్యూనే చేయాలని, అది చాలా పెద్ద కథ అని, చిన్నగా చెప్పడం సరిపోదని మారుతి అన్నారూ…
సినిమా జోనర్ గురించి చెబుతూ, తన సినిమా అంటే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్లు అన్ని ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ప్రభాస్ సినిమాలోకూడా ఆయా ఎలిమెంట్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చు.. అలాగే సినిమాలో హీరో కామెడీ కూడా చేస్తాడని కూడా మారుతీ క్లారిటీ ఇచ్చారు. భారీ సినిమాల మధ్య మంచి కామెడీ సినిమా చేయాలని ఉందని గతంలో ప్రభాస్ చెప్పిన మాటలను మారుతీ రిపీట్ చేసారు.అయితే ప్రభాస్ కు వున్న క్రేజ్ ప్రకారం భారీ స్కేల్‌లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. అయితే సినిమాని ప్రభాస్ లేకుండానే షూట్ చేస్తున్నారనే రూమర్లపై దర్శకుడు మారుతి రియాక్ట్ అవుతూ, సినిమాల్లో కొన్ని సీన్లలో హీరో అవసరం లేదు. బ్యాక్ నుంచి తీసే సీన్లు, కాళ్లు, చేతులు మాత్రమే కనిపించే సన్నివేశాలకు హీరో అవసరం ఉండదని బాడీ డబుల్ ని పెట్టి షూట్ చేస్తారని, తాను కూడా అదే చేస్తానని, తాను మాత్రమే కాదు, ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించి అందరు అదే ఫాలో అవుతారని, ప్రతి హీరోకి డబుల్ ఉంటారని మారుతి తెలిపారు