NTV Telugu Site icon

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్‌ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!

Pawan Kalyan Ustaad Bhagat Singh

Pawan Kalyan Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మూడు సైన్ చేశారు. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్‌’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

READ MORE: Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బ్యాడ్ న్యూస్.. స్టార్ బ్యాటర్‌కు గాయం

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హరీష్ పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు. “పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించారు.

READ MORE:Naari Movie :‘నారి’ గొప్పతనాన్ని వివరిస్తూ.. కంటతడి పెట్టిస్తున్న పాట..

కాగా.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లారు పవన్ కల్యాణ్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్ లో బయలుదేరిన పవన్… ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. కారు టాప్ పై అలా కాళ్లు బారజాపుకుని మరీ ఆయన రిలాక్డ్స్ డ్ గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్… కారుపై అలానే రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా ప్రయాణం చేసినందుకు కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సీన్‌ను సినిమాలో పెడుతుండటంతో ఫ్యాన్స్‌కు మారోసారి గూస్ బంప్స్ పక్కా వస్తాయి..