War 2 Update: చల్ హట్.. యుద్ధానికి ముందు టైగర్‌ను చూశారా?
- బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్ 2
- రొటీన్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 ఉండనుందనే కామెంట్స్
- అసలు సిసలైన వార్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘వార్ 2’ సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ టీజర్‌తో ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వచ్చిన వార్ 2 టీజర్.. తీరా రిలీజ్ అయ్యాక ఊసురుమనింపించింది. విజువల్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో లేదంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. వార్ మొదటి భాగం లాగే.. రొటీన్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 ఉండనుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్‌కు ఇచ్చిన ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్‌కే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్టుగా ఉందని అంటున్నారు.
ఇటు బిజినెస్ విషయంలోను తెలుగులో వార్ 2కి డిమాండ్ తగ్గినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా వార్ 2 టీజర్ అంచనాలను కాస్త తగ్గించేలా చేసింది. దీంతో ఇప్పుడు అసలు సిసలైన వార్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ స్టిల్ ఒకటి షేర్ చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్‌తో పాటు హృతిక్, కియారా అద్వానీతో ఉన్న స్టిల్స్ కూడా షేర్ చేశాడు అయాన్ ముఖర్జీ. అలాగే వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించిందని రాసుకొచ్చాడు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
Also Read: Peddi Update: పెద్ది.. ఇది అస్సలు ఊహించలేదుగా?
ఇక ఈ పిక్‌లో ఎన్టీఆర్ మస్త్ ఉన్నాడనే చెప్పాలి. దర్శకుడు సీన్ వివరిస్తుండగా.. ఎన్టీఆర్ అలా కూర్చొని అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. దీంతో ఇక్కడి నుంచి వార్ 2పై హైప్ పెంచేలా ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా ఎన్టీఆర్ గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆయన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాబట్టి. మరి వార్ 2 ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!