Anil Ravipudi : తన సినిమాపై వస్తున్న పుకార్లపై సెటైర్ వేసిన దర్శకుడు అనిల్ రావిపూడి

Anil Ravipudi

Anil Ravipudi

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. నేడో రేపో అధికారక ప్రకటన వస్తుందని కూడా న్యూస్ వినిపించింది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీమతి లత రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు.

Also Read : Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్

 ఈ రూమర్లపై ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ అనిల్ రావిపూడి సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. “నేను ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదు. కానీ అప్పుడే కథ, నటీనటులు, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే మీరే యాక్షన్.. కట్ కూడా చెప్పేస్తారేమో!” అంటూ సెటైర్ వేసాడు. తన సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది, అది ఎలాంటి కథ అనే విషయాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. “నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలతో మీకు అందిస్తాం” అని అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.